సంతోష్ శోభన్ కెరీర్‌లో ‘ప్రేమ్ కుమార్’ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది – నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు
సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు…
నిర్మాతగా జర్నీఎలా ఉంది?
– డిఫరెంట్ బ్యాగ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. నెమ్మదిగా బిజినెస్ ప్రారంభించా, 10 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉంటున్నాను. సాధారణంగా బిజినెస్ రంగానికి, సినీ రంగానికి చాలా తేడా ఉంది. ఎంటైర్ సినీ జర్నీలో క్రియేటివ్ థాట్స్‌కి, బిజినెస్‌కి చాలా తేడాలుంటాయి. వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడకు ముందుకు పోవాలని నాకు అర్థమైంది. నిర్మాతగా ఈ జర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చింది.
‘ప్రేమ్ కుమార్’ కథాంశాన్నే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు?
– నిర్మాతగా ప్రేమ్‌కుమార్ నా తొలి సినిమా. పరిమితమైన బడ్జెట్‌లో మంచి ఎంటర్‌టైన్మెంట్ మూవీ చేయాలని అనుకున్నాను. అందువల్ల చాలా కథలు విన్నాం. సంతోష్ కూడా ఎప్పుడు ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయలేదు. అందుకనే ఈ కథను సెలక్ట్ చేసుకున్నాం. అన్నీ పాత్రల్లో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. పెళ్లి అనేది స్క్రిప్ట్‌లో ఓ భాగం మాత్రమే. సంతోష్ శోభన్, అభిషేక్ నాకు చాలా మంచి స్నేహితులు. వారి కోసం ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పటికీ సబ్జెక్ట్‌లో దమ్ము కనిపించింది. అందుకనే ముందుకు అనుకున్న బడ్జెట్ కంటే కథ డిమాండ్ మేరకు కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టే సినిమా చేశాం.
*నిర్మాతగా తొలి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి?*
– బేసిగ్గా నేను చాలా సాఫ్ట్ పర్సన్. ఏదైనా సమస్య వస్తే అరిచి గొడవపడటం చేయను. ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతుందని నమ్ముతాను. సమస్య మనకు అర్థమైతే పరిష్కారం సులభంగా తెలిసిపోతుంది. ఈ సినిమా విషయానికి వస్తే మా మధ్య గొడవలేం జరగలేదు. క్రియేటివ్ జర్నీలో అభిప్రాయ బేదాలనేది సాధారణంగా జరుగుతుంటాయి. స్నేహితులం కాబట్టి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాం.
*‘ప్రేమ్ కుమార్’మూవీ కథలో మీ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటి?*
– కథ నాకు బాగా నచ్చింది. 30-35 కథలు విన్నాం. హీరో, దర్శకుడు ఎవరనేది ముందుగానే ఫిక్స్ అయ్యాం. దాని మీదనే ఫస్ట్ నుంచి వర్కవుట్ చేసుకుంటూ వచ్చాం. చాలా విశ్లేషణలు తర్వాత ‘ప్రేమ్ కుమార్’ కథ అయితే సరిపోతుందనిపించింది. ఎందుకంటే సాధారణంగా మన సినిమాల్లో హీరో హీరోయిన్ పెళ్లి సమయంలో పారిపోవటమే, ఫైట్ చేసి కలిసిపోవటమే జరుగుతుంటుంది. అది ఎక్కువగా హీరో హీరోయిన్స్ కోణంలోనే చూపిస్తూ వచ్చారు. మరి పెళ్లి పీటల మీదున్న పెళ్లి కొడుకు పాయింట్‌ను ఎవరూ చూపిచంలేదు. ఉన్నా ఏ ఒకట్రెండు సినిమాల్లోనే చూసుంటారు. ఆ పాయింట్ నాకు ఆసక్తికరంగా అనిపించింది. పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ యువకుడు మానసికంగా ఎలాంటి బాధను అనువిస్తాడు. అతని కుటుంబానికి వచ్చే సమస్యలు ఏంటి? అనే దాన్ని ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్‌లో చూపించాం.
*హీరోగా సంతోష్ శోభన్ మాత్రమే ఎందుకని అనుకున్నారు?*
– సంతోష్ శోభన్ బ్రిలియంట్ యాక్టర్. తను భవిష్యత్తులో చాలా పెద్ద హీరో అవుతాడు. ప్రతీ నటుడికి ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నాకు తెలిసి ఈ ‘ప్రేమ్ కుమార్’ సినిమా తన బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే సినిమా. రేపు సినిమాను చూసిన తర్వాత తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అంటారు. ఇంతకు ముందు తను చేసిన సినిమాల కథలు తన చుట్టూ జరిగితే .. ‘ప్రేమ్ కుమార్’ సినిమా మాత్రం సంతోష్ క్యారెక్టర్‌ను బేస్ చేసుకునే నడిచే కథ. సంతోష్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. మేం నా ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులతో కలిసి సినిమా చూశాం. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది.
*హీరోయిన్స్ గురించి…!*
– హీరోయిన్స్ రాశీ సింగ్, రుచిత సాధినేని అద్భుతంగా నటించారు. దర్శకుడు అభిషేక్ వీరిద్దరినీ సెలక్ట్ చేసుకున్నారు. ప్రభావతిగారు, అశోక్‌గారు ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను మనం లైవ్‌లో చూసినట్లే అనిపిస్తుంది.
*నెక్ట్స్ మూవీస్*
– స్నేహితుల కోసమే సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశాను.మా గ్రూపులోనే 10 -12 మంది ఉన్నారు. వారిలో డైరెక్టర్స్, రైటర్స్ ఉన్నారు. అందరికీ ఓ బేస్ కావాలని స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో దీన్ని ఇంకా పెద్దదిగా కొనసాగించవచ్చుననే నమ్మకం కలిగింది. లాక్ డౌన్ సమయంలో మా టీమ్‌తో కలిసి 40 కథలను సిద్ధం చేశాం. అందులో 10 కథలు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జోనర్ మూవీస్‌లో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
‘Prem Kumar’ Is One Of The Best Movies In Santosh Soban ‘s Career – Producer Shiva Prasad Panneeru
Santosh Soban ‘s latest film ‘Prem Kumar’ co-starring Raasi Singh and Ruchitha Sadineni is getting ready to release on August 18. Shiva Prasad Panneeru bankrolled the film under Sharanga Entertainments Pvt Ltd banner. Writer Abhishek Maharshi is making his directorial debut with this film. ‘Prem Kumar’ is being made with love and entertaining elements. On this occasion, Producer Shiva Prasad Panneeru interacted with media. Here’s the interview.
*How is the journey as a Producer?*
– I entered into film industry from a different background. Ours is a middle class family. I started business and has been doing it for the last 10 years. Business field and Movie Industry have so much difference. There are a lot of differences in creative thoughts and business in the film industry. I understood one must balance all these aspects to move forward in this industry. This journey as a Producer gave me immense happiness.
*Why did you chose ‘Prem Kumar’ story for your first film?*
– Prem Kumar is my first film as a producer. I wanted to make a good entertaining film in a limited budget. That’s why we heard to a lot of stories. Satosh too hasn’t done an out and out comedy film in his career. Due to these reasons we finalised this story. All characters have scope to perform. Marriage is only a part of the script. Santosh Soban and Abhishek are very close friends to me. Though I started this film for them, I see very good content in the film. That’s why we increased budget further as per the story of the film.
*What are the obstacles you faced as a first time producer while making this film?*
– Basically I am a very soft person. I don’t yell whenever problems arise. I belive in talking and resolving issues. If we understand the problem, it solution will be clear. Coming to this film, we didn’t had any issues among ourselves. In the process of a creative journey, differences arise naturally. We understand them as we were friends and moved forward.
*What is the triggering point in the story of ‘Prem Kumar’?*
– I liked the story a lot. We listened to 30-35 stories. We fixed about Hero and Director right from the beginning. Then we worked out on the story. After many reviews, we locked ‘Prem Kumar’ story. Usually in our films, during marriage time Hero and Heroine gets eloped or gets United after a fight. It has been in the point of view of Hero and Heroine. But, no one thought about what happens to that bridegroom who was supposed to marry the Heroine. There are two, three film which touched that point but not many. I find that point interesting. When his marriage was cancelled last minute, what kind of emotional turmoil he undergoes, what are the problems his family faces? We dealt such points in an entertaining fashion.
*Why did you chose Santosh sh Soban as your Hero?*
– Santosh Soban is a brilliant actor. He will become a big hero in th coming days. Every actor has a different body languages. This ‘Prem Kumar’ movie perfectly suits his body language. Everyone will say after watching the film that this is his career best performance. So far his films run around him. But, Prem Kumar is based on his character in the film. I believe ‘Prem Kumar’ will become one of the best movies in Santosh’s career. I watched the film along with my family members and friends. Everyone loved and enjoyed it.
*About Heroines*
– Heroines Raasi Singh, Ruchitha Sadineni performed very well. Director Abhishek has selected them. Phrabhavathi garu, Ashok garu… every character came out naturally.
*About next projects*
– I have started Sharanga Entertainments Pvt Ltd banner for the sake of my friends only. We have 10 – 12 members in our group. We have directors and writers in them. We started it to provide a base for them. While travelling in this journey, we got more confidence to continue this. We have readied about 40 stories with our team during lock down period. Out of them 10 are ready with bounded scripts. I want to make movies in different genres.