Rajasekhar’s ‘Shekar’ to be released in theatres on May 20

0
86
Rajasekhar’s ‘Shekar’ to be released in theatres on May 20

‘Shekar’ is the 91st movie in the career of Dr. Rajasekhar. His elder daughter, Shivani, has played a crucial role in the movie. She has played Rajasekhar’s daughter in it. This is the first-of-its-kind collaboration of a father and a daughter on the silver screen. The film is directed by Jeevitha Rajasekhar, who has also penned the thriller’s screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations. ‘Shekar’ is presented by Vankayalapati Murali Krishna.

Come May 20, ‘Shekar’ is going to be released in theatres worldwide in collaboration with Venkata Sai Films’ Muthyala Ramdass garu. On Saturday, the makers unveiled the film’s release date poster.
Speaking on the occasion, producer Boggaram Venkata Srinivas said, “My partner Beeram Sudhakar had supported ‘PSV Garuda Vega’ financially. When Rajasekhar garu expressed the desire to do ‘Shekar’, we came forward to be its producers. The hero has donned a different get-up in ‘Shekar’. Emotions, action and sentiment are in good dose. I am very happy with the product. Rajasekhar garu worked with dedication despite his health issues. I thank my fellow producers and presenter. Muthyala Ramdass garu came forward to release the movie worldwide after watching the content. I thank him on this occasion.”

Director Jeevitha said, “I thank the producers and presenter for supporting us. ‘Shekar’ is a heart-touching movie. You will see relatable family emotions in the era of Covid-19 in our movie. The audience have always been embracing films laced with emotions. Rajasekhar garu has scored hits with films like ‘Gorintaku’, ‘Akka Mogudu’, ‘Maa Annayya’, ‘Simha Rasi’. ‘Shekar’ is a notch higher. Rajasekhar garu is attending the look test for his upcoming movie. That’s why he is not here today with us. ‘Shekar’ will be an unforgettable movie. Artists and technicians have supported us fully.”

“Several rumours have been created about an arrest warrant. Let me say that nobody has arrested me. It’s true that a warrant has been issued. My legal team is responding to the same. We have been alert ever since we came to know about the summons. When the court gives its verdict, everyone will come to know the truth,” Jeevitha said, adding that the issues concerning producer Koteswara Raju will become known to one and all soon. She suggested that the intentions of the other side are not well-meaning. “Nobody can defame me. I am honest enough to admit to a mistake if I really commit one,” Jeevitha said, adding that her conscience is clear.

Muthyala Ramdass said, “I have a lot of respect for Rajasekhar garu. You are going to see a new Rajasekhar garu in ‘Shekar’. I have watched the movie. The output is superb. That’s why I have decided to release it on May 20.”

Actor Sameer said, “I have played a very important part. Rajasekhar garu is called an angry young man. But, on set, he is always jovial. This is the first time that I have played this sort of a full-length role with a male lead. Jeevitha garu takes care of everything on set. Rajasekhar garu’s get-up is amazing. That way, the film is already half a hit even before its release. This is the best Rajasekhar garu movie. He has done an amazing job as an actor. I am eagerly waiting for its release.”

Actor Bharani Shankar said, “I thank the director for the good character. This is my first movie with Rajasekhar garu. During the making of some scenes, I was moved to tears. His performance is outstanding. Anup Rubens’ music is top-notuch. You are going to enjoy the songs and the scenes. I thank the makers for this opportunity.”

Actor Ravi Varma said, “Doing this film has been an emotional journey. I am happy that I got to work with Rajasekhar garu. He would make us laugh on set every day. I enjoyed a lot doing ‘Shekar’. This is not a regular movie.”

Cinematographer Mallikarjun Naragani said, “Jeevitha garu game a huge responsibility of doing this project. I never imagined that I would be doing a film of this scale. All credit goes to Jeevitha garu.”

Cast and Crew:

Dr. Rajashekar, Aathmeeya Rajan, ‘George Reddy’ fame Muskaan Kubchandhani, Abhinav Gomatam, Kannada Kishore, Sameer, Bharani, Ravi Varma, Shravan Raghavendra and others are the principal cast.

PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Art Direction: Sampath; Writer: Lakshmi Bhupala; Cinematographer: Mallikarjun Naragani; Music Director: Anup Rubens; Producers: Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, Boggaram Venkata Srinivas; Screenplay, Direction: Jeevitha Rajashekar.

_____________
మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజ”శేఖర్”

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్  నటించిన 91 వ సినిమా  “శేఖర్”. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని యఫ్.యన్.సి.సి లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి శేఖర్ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసింది. అనంతరం

 చిత్ర నిర్మాతలలో ఒకరైన వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, గరుడవేగ, కల్కి వంటి మంచి హిట్ సినిమాలు చేసిన తరువాత,  మేము ఒక సినిమా చూశాము చాలా బాగుంది ఆ సినిమాను తెలుగులో చెయ్యలనుకుంటున్నాము అని జీవిత గారు చెప్పినప్పుడు నా పార్టనర్ బీరం సుధాకర్ రెస్పాన్డ్ అయ్యి మేము గరుడవేగ కు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాము, ఈ సినిమాను మేమే ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారి డిఫరెంట్ గెటప్ తో ఎమోషన్, యాక్షన్,సెంటిమెంట్ ఉన్న మంచి సినిమా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ గారికీ  హెల్త్ సహకరించకపోయినా ఈ సినిమాకు ఎంతో ప్రాణం పెట్టి పని చేశారు.అలాగే నాకు సపోర్ట్ గా నిలిచిన మా పార్ట్నర్స్ బీరం సుధాకర్ రెడ్డి, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన ముత్యాల రాందాస్ గారు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా నేను రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20 న వస్తున్న శేఖర్ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… మాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా శేఖర్ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా “శేఖర్”.కోవిడ్ తరువాత ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషనల్ సఫ్ఫరింగ్ ను ఇందులో చూస్తారు..  ప్రేక్షకులు ఎప్పుడు ఎమోషన్ ఫిలిమ్స్ ఆదరిస్తూ వస్తున్నారు. గోరింటాకు, అక్కమొగుడు,మా అన్నయ్య, సింహారాశి, దగ్గర్నుంచి రాజశేఖర్ గారి చాలా సినిమాలను ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాలకంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్ గా అవుతారు. ఈ సినిమా లో రాజశేఖర్ గారి కూతురు పాత్రలో శివాని నటించింది,  వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా సెంటిమెంటల్ గా ఉంటాయి.   రాజశేఖర్ గారికి నెక్స్ట్ చేయబోయే సినిమాకు లుక్ టెస్ట్ ఉన్నందున రాలేకపోయారు.అలాగే ఈ శేఖర్ సినిమా మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది.ఈ శేఖర్ సినిమా పూర్తి కావడానికి ఆర్టిస్టులకు,టెక్నిషియన్స్ ఎంతో సపోర్ట్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశాము. మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

నగరి కోర్ట్ ద్వారా నాకు వారంట్ వచ్చింది అరెస్ట్ అయ్యింది అని నాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మీముందు నేను శుభ్రంగా ఉన్నాను.నాకు వారంట్ వచ్చింది నిజమే.. ఆ వారంట్ ఎందుకు వచ్చింది అనే దానికి కచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది. దానిని మా లీగల్ టీం చూసుకుంటుంది.మాకు సమన్లు వచ్చినా వాటిని మాకు అందకుండా జేశారు.అవి వచ్చిన విషయం తెలిసిన వెంటనే మేము అలర్ట్ అయ్యాము. అప్పుడు నేను కోవిడ్ తో సఫర్ అవుతుండడంతో  మా లాయర్ కోర్ట్ లో అటెండ్ అయ్యారు.ఇప్పటికీ ఆ కేస్ నడుస్తుంది.ఆ తీర్పు వచ్చిన రోజు అందరికీ కచ్చితంగా తెలుస్తుంది. జీవిత మోసం చేసిందా లేక జోస్టార్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ కొటేశ్వర్ రాజు గారా ఎవరు ఎవరిని మోసం చేశారు అనేది.ఈ మధ్యలో ఆయన భార్య హేమ గారు ఎందుకు వచ్చారు? ఆ కోటేశ్వరరావు గారి పైన ఇక్కడేం కేసు ఉంది.ఆయన వల్ల మా మేనేజర్లు ఎంత సఫర్ అవుతున్నారు. అన్ని కూడా రేపు కోర్ట్ లో ఆటోమేటిక్  బయటికి వస్తాయి. 2 నెలల కిందటి ఇష్యూ ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వెనుక ఇంటెన్షన్ ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.ఒక వేళ మమ్మల్ని డిఫేమ్ చెయ్యాలనో, లేక నన్ను డి మోరలైజ్ చెయ్యాలి అనుకుంటే అది ఎవ్వరి తరం కాదు.మేము తప్పు చేసిన రోజు తప్పుచేశాం అని ఒప్పుకునే ధైర్యం ఉంది.చెయ్యని రోజు చేయలేదని భగవంతుని ముందు నిల్చొని ఎదురు మాట్లాడే ధైర్యం నాకు ఉంది. మేము ఏ తప్పు చేయలేదు కోర్ట్ ఏ తీర్పు చెప్పినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు.

ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. నాకు రాజశేఖర్ గారు అంటే ఎంతో ఇష్టం. ఈ సినిమాను చూపించమని అడిగిన వెంటనే జీవిత గారు, నిర్మాతలు ఈ సినిమాను చూపించారు.సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను మే 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాను అన్నారు.

నటుడు సమీర్ మాట్లాడుతూ.. నేను ఈ సినిమాలో వెరీ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. అందరూ రాజశేఖర్ గారు చాలా యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. కానీ సెట్ లో చాలా చిన్న పిల్లడిలా మాతో చాలా జాలీగా ఉండేవాడు. నేను ఇప్పటివరకు ఏ హీరోతో ఇంత లాంగ్ లెన్త్ రోల్ చేయలేదు. నా కెరీర్లో ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా ఇది. జీవిత గారు చాలా స్వీట్ పర్సన్ తనే ఏ టు జెడ్ అన్నీ దగ్గరుండి చూసుకుంది.ఈ సినిమాలోని రాజశేఖర్ గెటప్ అదిరించి.ఆ గెటప్ కు ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. ఇక్కడే ఈ సినిమా 50% సక్సెస్ సాధించింది. తనెంత కష్టపడ్డాడో తన వర్క్ ఏంటో ఈ సినిమా ద్వారా కనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్  ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్లింది. ఇప్పటి వరకు నేను చూసిన రాజశేఖర్ గారి సినిమాలలో కల్లా ఈ సినిమా బెస్ట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.తన కంప్లీట్ యాక్టింగ్ ఇందులో కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

నటుడు భరణి శంకర్ గారు మాట్లాడుతూ..జీవిత రాజశేఖర్ గారు ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. రాజశేఖర్ గారితో చేయడం ఇది నా ఫస్ట్ మూవీ.తను చేసి కొన్ని సీన్స్ కు మేమే కనెక్ట్ అవ్వడంతో మాకే తెలియకుండా మా కళ్ళలో నీళ్లు వచ్చేవి. రాజశేఖర్ గారు అంత అద్భుతంగా నటించారు. వారితో వర్క్ చేయడం మాకు వండర్ఫుల్ జర్నీ.అనూప్ గారు తన పాటలతో సినిమాకు ప్రాణం పోశారు. అన్ని పాటలు చాలా అల్టిమేట్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు మేం చేసిన అల్లరి చూసి చాలా ఎంజాయ్ చేస్తారు..ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ థియేటర్ కు వచ్చి మా సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను అన్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఫుల్ ఎమోషన్ జర్నీ చేసిన సినిమా”శేఖర్”.ఇప్పటివరకు రాజశేఖర్ గారి గురించి విన్నానే తప్ప చూడలేదు. అటువంటిది తనతో నటించినదుకు చాలా ఆనందంగా ఉంది.ఇందులో రాజశేఖర్ గారి గెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది..రాజశేఖర్ గారు ప్రతి రోజు సెట్ లో అందరినీ నవ్వించేవారు. నా కెరీర్లో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇదే అవుతుంది. జీవిత గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బాగా చాలా బాగా చూసుకున్నారు. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. ఏమోషన్ తో అటాచ్ అయిన యాక్షన్ ఇందులో ఉంటుంది. రాజశేఖర్ గారికి  బెస్ట్ సినిమా అవుతుంది.మే 20 న విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

డి.ఓ.పి మల్లికార్జున్ నరగని మాట్లాడుతూ.. ఎక్కడో ఉన్న నన్ను తీసుకువచ్చి మా అక్క జీవిత గారు నాపై ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టారు. నేను ఇంత పెద్ద సినిమా చేస్తానని జీవితంలో కూడా అనుకోలేదు.ఈ క్రెడిట్ అంతా జీవితా రాజశేఖర్ లాగారికే చెందుతుందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడిన వారంతా మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు

నటీనటులు
రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న

సాంకేతిక నిపుణులు
సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని,
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల

———————-
మాపై వ‌చ్చిన ఆరోపణల్లో నిజం లేదు- జీవితా రాజశేఖర్‌
తప్పు ఉంటే ఒప్పుకుంటా. లేదంటే దేవుణ్ణి కూడా ధైర్యంగా నిలదీస్తా – జీవితా రాజశేఖర్‌

ఈ సంద‌ర్భంగా జీవితా రాజశేఖర్ త‌మ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లగురించి కూలంక‌షంగా వివ‌రించారు. గరుడ వేగ’ సినిమా విషయంలో జీవితా రాజశేఖర్‌ తమను మోసం చేశారని జోస్టార్స్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జీవిత స్పందించారు. శనివారం ఏర్పాటు చేసిన ‘శేఖర్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో జీవిత మాట్లాడుతూ ‘‘మాపై వచ్చిన ఆరోపణల కేసు ప్రాపెసింగ్‌లో ఉంది. నగరి నుంచి సమన్లు వచ్చి రెండు నెలలు అవుతుంది. అవి మాకు కొంద‌రు అడ్డుకున్నారు. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు ఉంటే ఒప్పుకుంటా. లేదంటే దేవుణ్ణి కూడా ధైర్యంగా నిలదీస్తా. మాపై ఆరోపణలు చేసినవారు ఉత్తములు కాదు. వాళ్ల వల్ల మా మేనేజర్‌తోపాటు చాలామంది ఇబ్బందులు పడ్డారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఏది నిజమో కోర్టు చెబుతుంది. కాబట్టి నేను పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. మా పరువు  తీయాలని చూస్తే ఊరుకోం. మేము ఏ తప్పు చేయలేదు కోర్ట్ ఏ తీర్పు చెప్పినా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్నాం తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్‌మీడియాలో వ‌స్తున్న తంబ్‌లైన్‌పైనా చుర‌క‌లు వేశారు. ఒక‌ప్పుడు `మా` ఎల‌క్ష‌న్ సంద‌ర్భంగా మా కుటుంబం పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో మ‌మ్మ‌ల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావ‌డంలేదు. మా మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ లైన్స్ పెడుతున్నారు. అదేవిధంగా నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారని, తమ కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారని అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయని జీవిత అన్నారు పాజిటివ్ థింకింగ్‌తో తాను ముందుకు పోతానని, తామంటే నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు.

‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్
2017లోనే కోటేశ్వరరాజు మీద డీమానుటైజేషన్ కేసు ఉందని, పోలీసుల కళ్ళు గప్పి ఆయన తిరుగుతున్నారని ‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్ చెప్పారు. అసలు రూ.26 కోట్లు ఆయన ఎక్కడ నుండి తెచ్చి ఇచ్చారో కోటేశ్వరరాజు నిరూపించుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. జీవితకు- కోటేశ్వరరాజుకు మధ్య ఉన్న వివాదంలోకి తమ ఫైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి పేరు తీసుకురావడం దారుణమని చెప్పారు.