Impressive Trailer Of Santosh Soban Starrer ‘Prem Kumar’ Promises A Fun Rider

0
142
ఫ‌న్ రైడ‌ర్‌గా సంతోష్ శోభ‌న్ ‘ప్రేమ్ కుమార్’ … ఆకట్టుకుంటోన్న ట్రైలర్
టాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ ప్రేమ్‌కుమార్‌గా న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధ‌మవుతున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.ప్రేమ్ కుమార్ వ్య‌థ పేరుతో ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం ఆసక్తిక‌రంగా ఉంది. అస‌లు హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. హీరో పెళ్లి వ‌య‌సు వ‌చ్చింద‌ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ ఏదో ఒక కార‌ణంతో అత‌ని పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. దీంతో హీరోని అంద‌రూ ఆట ప‌ట్టిస్తుంటారు. చివ‌ర‌కు విసిగిపోయిన హీరో పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటాడు. అప్పుడు అత‌ని హీరోయిన్ ఎలా పరిచ‌యం అవుతుంది. అస‌లు హీరోకి పెళ్లి అవుతుందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

కథలో ట్విస్టులు మీద ట్విస్టులు ఆస‌క్తికంగా ఉన్నాయి.  టీజ‌ర్‌ను వైవిధ్యంగా రిలీజ్ చేసి ఆడియెన్స్ దృష్టిని ఆక‌ర్షించిన మేక‌ర్స్‌.. ఇప్పుడు ట్రైల‌ర్‌ను అంత‌కు మించిన ఎంట‌ర్‌టైన్మెంట్‌తో మిక్స్ చేసి రిలీజ్ చేశారు.  ఈ చిత్రానికి సంగీతం ఎస్.అనంత్ శ్రీకర్ అందించగా.. ఎడిటర్ గ్యారీ బీహెచ్ వ్యవహరిస్తున్నారు. డీఓపీగా రాంపీ నందిగం పనిచేస్తున్నారు.

Impressive Trailer Of Santosh Soban Starrer ‘Prem Kumar’ Promises A Fun Rider
Hero Santosh Soban who earned recognition for his knack of choosing different films in Tollywood right from the beginning of his career is now coming as ‘Prem Kumar’ to entertain the audience. His latest film is ‘Prem Kumar’. Actor, Writer Abhishek Maharshi is making his directorial debut with this film. Shiva Prasad Panneeru is bank-rolling this film under Sharanga Entertainments Pvt Ltd. Rashi Singh, Ruchitha Sadineni playing as female leads. Krishna Chaitanya, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Sri Vidya are doing other key roles. Makers released the trailer of ‘Prem Kumar’ on Tuesday.It is quite interesting to see the trailer released with the Tag, ‘Prem Kumar Vyadha’.  The hero’s characterisation is designed in a quite intriguing manner. Hero wants to get married as he has come to the age of marriage. But, due to some reason his marriages are being stalled. This resulted in everyone making a mockery of Hero. Finally, frustrated Hero decided not to get married and opens a detective agency. Then how did he meet the heroine, Did hero gets married at the end? To know more about these one should watch the film says the makers.

Twists in the tale raises curiosity. Makers succeeded in grabbing the attention of the audience by releasing the teaser in an innovative manner. Now they raised curiosity by blending more entertainment in the trailer. S. Anant Srikar provided the music for this film. Garry BH is the editor. Rampy Nandigam is cranking the camera.