Will enthrall all with Calling Sahastra in theatres: Sudigali Sudheer in Kanula Neeru Raalade song release event

0
109
త్వరలోనే  ‘కాలింగ్ సహస్త్ర’తో థియేటర్స్‌లో సందడి చేస్తాం – హీరో సుధీర్

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. ‘గాలోడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. టీవీ షోస్‌లో న‌వ్వించిన సుధీర్ , గాలోడు చిత్రంలో మాస్ హీరోగా ఆక‌ట్టుకున్నారు. అయితే ఈసారి మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘కనుల నీరు రాలదే.’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా…సినిమాటోగ్రాఫర్  డి. శశి కిరణ్  మాట్లాడుతూ ‘‘త్వరలోనే ‘కాలింగ్ సహస్త్ర’ చిత్రం విడుదలవుతుంది. సుధీరన్న చాలా కొత్తగా అందరినీ మెప్పిస్తారు’’ అన్నారు.

హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ ‘‘సుధీర్‌గారికి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. చాలా మంచి వ్యక్తి. తనతో కలిసి వర్క్ చేయటాన్ని ఎంజాయ్ చేశాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థాంక్స్. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కి కాస్త సమయం పట్టింది. కానీ.. అద్భుతమైన ఔట్ పుట్ వచ్చింది. ఎంటైర్ యూనిట్‌కి థాంక్స్’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మాట్లాడుతూ ‘‘సుధీర్‌గారు ఈ సినీ జర్నీలో నాకెంతో మంచి స్నేహితుడు అయ్యారు. కాలింగ్ సహస్త్ర మూవీలో మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సబ్జెక్ట్‌ని బేస్ చేసుకుని మ్యూజిక్‌ని అందించాం. అన్నీ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. హీరోయిన్ డాలీషా తెలుగు నేర్చుకుని నటించారు. డైరెక్టర్ అరుణ్ గారికి, సినిమాటోగ్రాఫర్ సన్నిగారికి థాంక్స్. మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. సుద్దాలగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. మా నిర్మాతలకు స్పెషల్ థాంక్స్’’ అన్నారు.

నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘సినిమాను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. మాకు బిజినెస్‌లో సపోర్ట్‌ నిలుస్తున్నందుకు బెక్కెం వేణుగోపాల్‌గారికి, రామచంద్రగారికి థాంక్స్. సుధీర్‌గారి అభిమానుల కారణంగా మూవీ నుంచి రెండో పాటను కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేశాం. తప్పకుండా పాట, సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం.

నిర్మాత విజేష్ తయల్ మాట్లాడుతూ ‘‘కనుల నీరు రాలదే..’ పాటకు మోహిత్ మంచి సంగీతాన్ని అందించారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. దర్శకుడు అరుణ్ చాలా కాలంగా తెలుసు. తను సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. బెక్కెం వేణుగోపాల్‌గారు ఇప్పుడు మా టీమ్‌లో ఓ మెంబర్ అయ్యారు. సుధీర్‌గారితో మంచి జర్నీ. తనే ముందుండి ఫోర్స్‌లా అందరినీ నడిపించారు. సినిమాను ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్  అరుణ్ విక్కిరాల మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర తర్వాత సుధీర్ రేంజ్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. తనొక సూపర్ స్టార్ అవుతారు. మేం ఎంత బాగా సినిమాను తీసినా మంచి మ్యూజిక్ లేకపోతే అద్భుతం జరగదు. ఈ సినిమా విషయానికి వస్తే మోహిత్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. అలాగే మార్క్ కె.రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సూపర్బ్‌గా అందించారు.  మా ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్. సుధీర్ అభిమానుల కోసం ఈవెంట్‌ని ప్లాన్ చేశాం. అందుకనే వారి సమక్షంలోనే పాటను రిలీజ్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

రామచంద్రరావు మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర చిత్రంలోని మొదటి పాటను ఆడియెన్స్ ఎంత ఎంజాయ్ చేశారో మనకు తెలుసు. అందుకనే ఇప్పుడు రెండో సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నాం. సుధీర్‌గారు, అరుణ్‌గారికి థాాంక్స్. సుధీర్‌ని పెద్ద స్టార్‌గా కాలింగ్ సహస్త్ర మూవీ నిలబెడుతుంది’’ అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర సినిమాను చూడగానే బాగా నచ్చింది. వెంటనే టీమ్‌తో ట్రావెల్ మొదలు పెట్టాం. టీజర్, ఫస్ట్ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సర్‌ప్రైజింగ్ ట్రైలర్‌ను విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాం. సినిమాను భారీగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్టర్ అరుణ్ సినిమాను తెరకెక్కించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాం. మూవీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. సుధీర్‌ని కెరీర్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నాను. చాలా మంచి వ్యక్తి.  ప్రేక్షకులు సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మోహిత్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే జిత్తు మాస్టర్ సాంగ్‌ని చక్కగా కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత విజేష్‌గారితో జర్నీ మరచిపోలేను. సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఆయనకు ఇతర ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. బెక్కెంగారు సినిమా చూడగానే ఆయనకు నచ్చటంతో మా టీమ్‌ని నడిపించటం మొదలు పెట్టారు. మంచి కంటెంట్ సినిమాలను సపోర్ట్ చేయాలనుకునే నిర్మాత ఆయన. డాలీషా మంచి నటి. నార్త్ అమ్మాయి అయినా తెలుగు నేర్చుకుని నటించారు. తనింకా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ ఈ స్టేజ్‌కి చేరుకున్నానంటే నా అభిమానుల ప్రేమే కారణం. టీవీ షోస్ చేసినా, సినిమాలు చేసినా వారు సపోర్ట్ చేశారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేస్తాం. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు:
సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్, రచన దర్శకత్వం: అరుణ్ విక్కిరాల, నిర్మాతలు:  వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యల్‌, చిరంజీవి ప‌మిడి, సంగీతం : మోహిత్ రెహమానియక్, బ్యాగ్రౌండ్ స్కోర్ : మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ : డి. శశి కిరణ్, ఎడిటర్ : గ్యారీ బి.హెచ్‌,  పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర‌, ఫ‌ణి (బియాండ్ మీడియా).

Will enthrall all with Calling Sahastra in theatres: Sudigali Sudheer in Kanula Neeru Raalade song release event
Sudigali Sudheer, who shot to fame with his captivating performances on the small screen, successfully transitioned to the big screen, making a remarkable debut with the blockbuster film “Gaalodu.” Now, in his second film, “Calling Sahasra,” Sudheer is all set to entertain movie enthusiasts.

The film is being promoted on a grand scale, and recently, the makers released the song “Kanula Neeru Raalade.” Directed by Arun Vikkirala, the film stars Dollysha as the female lead and is produced by Vijesh Taayal, Venkateswarlu Katuri, and Chiranjeevi Pamidi under the banners of Shadow Media Productions and Radha Arts.

The post-production work for the film has been successfully completed, and the cinematographer has announced that “Calling Sahasra” will soon hit the theaters, with Sudheer delivering a different and entertaining role.

Dollysha, the female lead, expressed her gratitude for the opportunity to work with Sudheer and the entire team, emphasizing her enjoyment of the experience. She also mentioned that, despite some delays, the film’s output has turned out exceptionally well.

Mohit, the music composer, shared his positive experience working with Sudheer and the team, highlighting the emotional depth in the film’s music. He also praised director Arun, cinematographer Sunny, and lyricist Suddala for their contributions.

The producers, Venkateswarlu Katuri and Vijesh Thayal, thanked the film’s supporters, and Venkateswarlu expressed his appreciation for the strong support received. Bekkam Venugopal, who became part of the team, praised the teaser and the song’s positive response, mentioning their plans to release the trailer soon.

Director Arun Vikkirala expressed confidence that “Calling Sahasra” would elevate Sudheer’s stardom, with Mohit’s music and Mark K Robin’s background score contributing to the film’s impact. He thanked the producers and underlined their dedication to making the event a special treat for Sudheer’s fans.

Ramachandra Rao commended the film’s impact on movie lovers and announced the release of the second song. Bekkam Venugopal expressed his support for the film and emphasized the uniqueness it brings to the audience, promising a grand release.

Sudheer expressed his gratitude to his fans, thanked the music composer Mohit, and highlighted the appealing choreography by Jittu master. He praised producer Vijesh for his unwavering commitment to the project, with the support of other producers and Bekkam Venugopal. Sudheer also commended DollySha for her dedication to learning Telugu and delivering a remarkable performance. He wished her success and thanked his fans for their love, hinting at an impending announcement regarding the film’s release date

Banners:Shadow Media Productions and Radha Arts banners.

Cast:Sudheer Anand Bayana, Dollysha, Sivabalaji,  Manoharan, Raviteja Nannimala.
Technicians:

Written and Directed by Arun Vikkirala
Producers – Vijesh Taayal, Venkateswarlu Katuri, Chiranjeevi Pamidi
Music – Mohith Rahmaniac
Background Score – Mark K Robin
Songs –  Mohith Rahmaniac
DOP – Sunny D
Action – Shivaraj
Editor – Garry Bh
Lyrics – Lakshmi Priyanka
PRO: Naidu Surendra – Phani Kandukuri (Beyond Media)