Ajith Kumar’s Most-Awaited Film Vidaamuyarchi Teaser Raises Expectations, Set To Release For Sankranthi

0
376
Ajith Kumar’s Most-Awaited Film Vidaamuyarchi Teaser Raises Expectations, Set To Release For Sankranthi
Renowned star hero Ajith Kumar collaborated with acclaimed director Magizh Thirumeni and top production house, Lyca Productions, for the prestigious film Vidaamuyarchi. The film is set to be released during Sankranthi 2025. There has been a huge anticipation around the film since its announcement.

Having recently finished shooting, the film is now in post-production. The makers have unveiled the teaser now, showcasing Ajith Kumar in a different avatar. The teaser of this high-octane action thriller delivers the narrative, “When Everyone, When Everything, Abandons You, Believe In Yourself.” Ajith’s character is portrayed as someone willing to go to any lengths to fulfill his mission. The teaser has increased expectations for the film to the next level.

Lyca Productions, founded by Subaskaran and headed by G.K.M. Tamil Kumaran, is a top production house in the Indian film industry known for crafting high-budget and content-driven films. Magizh Thirumeni, known for creating versatile, entertaining and engaging films, directs this project.

Star actress Trisha and Action King Arjun are playing other pivotal roles in this movie. Earlier, we saw Ajith, Arjun and Trisha together in the blockbuster from Mankatha (Gambler in Telugu). Now, they are back again to enthral the audience with their stellar performances. Arav, Regina Cassandra and Nikhil are playing other key roles.

Kollywood’s Musical Rockstar Anirudh Ravichander is composing the music for this film. Om Prakash is handling the cinematography, NB Srikanth is working as the editor and Milan is serving as the Art Director. While Sundar composed the action sequences, Anu Vardhan designed the costumes. Subramanian Narayanan serves as the executive producer, with J. Girinathan and K. Jayaseelan as production executives. Other key crew members include G. Anand Kumar (stills), Gopi Prasanna (publicity designer), Hariharasuthan (VFX), Suresh Chandra (PR – Tamil), and Naidu Surendra Kumar and Phani Kandukuri (PR – Telugu).

SunTV acquired the satellite rights of Vidaamuyarchi, while Netflix has bagged OTT rights. The audio will be released through Sony Music.

Lyca Productions
Subaskaran Presents
Ajith Kumar in Vidaamuyarchi

Movie Credits:
Cast: Ajith Kumar, Trisha, Arjun Sarja, Regina Cassandra, Aarav, Nikhil Nair, Dasarathi, Ganesh
Director: Magizh Thirumeni
Music: Anirudh Ravichander
Director of Photography: Om Prakash ISC
Editor: NB Srikanth
Art Director: Milan
Stunt Master: Supreme Sundar
Costume Design: Anu Vardhan
Stills: G Anand Kumar
Publicity Design: Gopi Prasanna
VFX: Hariharasuthan
DI Colourist: Prasath Somasekar
PRO: Suresh Chandra (Tamil), Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media) – Telugu
Production Executives: J Girinathan & K Jeyaseelan
Executive Producer: Subramanian Narayanan
Head of Lyca Productions – G.K.M. Tamil Kumaran
Produced by Subaskaran

సంక్రాంతికి అజిత్ కుమార్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం
 ‘విడాముయ‌ర్చి’.. అంచ‌నాలు పెంచుతోన్న టీజ‌ర్‌

అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ను కంప్లీజ్ చేసుకుంటోంది. తాజాగా ‘విడాముయ‌ర్చి’ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమాలో హీరో అజిత్ కుమార్ డిఫ‌రెంట్ అవ‌తార్‌లో కనిపిస్తున్నారు. ప్ర‌పంచ‌మంతా నిన్ను న‌మ్మ‌క‌పోయినా ప‌రావాలేదు.. నిన్ను నువ్వు న‌మ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో సినిమా యాక్ష‌న్ బేస్డ్ మూవీగా తెర‌కెక్కింది. అజిత్ దేని కోస‌మో అన్వేషిస్తున్నారు.. చివ‌ర‌కు త‌న‌కు కావాల్సిన దాని కోసం విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతున్నారు. తాను సాధించాల్సిన ల‌క్ష్యం కోసం ఏం చేయ‌టానికైనా, ఎంత దూరం వెళ్ల‌టానికైనా, ఎవ‌రినైనా ఎదిరించేలా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో ఆయ‌న మెప్పించ‌బోతున్నారు అజిత్‌. టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి.

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్..‘విడాముయ‌ర్చి’ సినిమాను నిర్మిస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి.  ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. అలాగే విడాముయ‌ర్చిలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వారి పాత్ర‌ల‌ను కూడా టీజ‌ర్‌లో రివీల్ చేశారు. అలాగే సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌కటించారు.

కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్‌), గోపీ ప్ర‌స‌న్న (ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌), హ‌రిహ‌ర‌సుత‌న్‌(వి.ఎఫ్‌.ఎక్స్‌), సురేష్ చంద్ర (పి.ఆర్‌.ఒ-త‌మిల్‌), నాయుడు సురేంద్ర‌ కుమార్‌ – ఫ‌ణి కందుకూరి (పి.ఆర్.ఒ – తెలుగు) సినిమాలో భాగ‌మయ్యారు.

అజిత్ కుమార్  ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.